హైదరాబాద్కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డ్

హైదరాబాద్కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ శానిటేషన్, స్వచ్చ్ సర్వేక్షన్ టీమ్​కృషితో హైదరాబాద్ నగరానికి స్వచ్చ్ భారత్ మిషన్ కింద అవార్డు లభించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, ఏ నగరానికి ఎంత ర్యాంక్ వచ్చిందనే వివరాలను ఈ నెల 17న ఢిల్లీలో ప్రకటించనున్నారు. అధికారుల సమాచారం ప్రకారం టాప్ 9 లో హైదరాబాద్​కు ర్యాంక్ వచ్చినట్లు తెలిసింది. మొదటి మూడు ర్యాంకులు పొందిన నగరాలకు రాష్ట్రపతి, ఆ తర్వాతి ర్యాంకుల నగరాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అవార్డులను అందజేయనున్నారు.